Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చిన సిగ్మా పేరల్ కార్గో నౌకలోని 23 మంది సిబ్బందిని రక్షించేందుకు కోస్ట్‌గార్డ్ రంగంలోకి దిగింది. ఇంజిన్ ఫెయిల్యూర్, తీవ్ర సముద్ర ప్రవాహాల కారణంగా నౌక మార్గం తప్పినట్లు సమాచారం. మొగల్తూరు ప్రాంతంలో రెస్క్యూ చర్యలు చేపట్టి, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో బీభత్సం సృష్టిస్తున్న అర్నబ్ తుఫాన్ దెబ్బకు సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాన్ తీరం దాటే సమయంలో ఏర్పడిన అలల తాకిడికి సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ భారీ నౌక మార్గం తప్పి కోనసీమ జిల్లా అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చింది.