కన్న కూతురిని చంపి, ఆ తర్వాత భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వెలుగుచూసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బాధిత బంధువులకు అప్పగించగా.. లోయర్ ట్యాంక్‌బండ్ సమీపంలోని శ్మశానవాటికలో వారికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారా చూసిన బెంగాల్‌లోని దంపతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కన్న కూతురిని చంపి తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడగా.. వారి అంత్యక్రియలను బెంగాల్‌లోని బాధిత కుటుంబ సభ్యులు వీడియో కాల్ ద్వారా వీక్షించిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.