RCB Full Squad After WPL Auction 2027: డబ్ల్యూపీఎల్ 2027 సీజన్లో టైటిల్‌ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును మరింత బలోపేతం చేసుకుంది. వేలంలో నలుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జెస్ జోనాసెన్ను రూ.40 లక్షలకు, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్లోయ్ ట్రయాన్ను రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. భారత బ్యాటర్లు తేజల్ హసబ్నిస్ను రూ.30 లక్షలకు, వృందా దినేశ్‌ను రూ.10 లక్షలకు ఆర్సీబీ కొనుగోలు చేసింది..