విమానయాన సంస్థ ర్యాన్ఎయిర్ సిబ్బందిపై శ్రీలంక క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కుమార సంగక్కర సంచలన ఆరోపణలు చేశాడు. ఐర్లాండ్‌లోని డబ్లిన్ విమానాశ్రయంలో తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో గేట్ సిబ్బంది నుంచి వివక్షపూరిత, బెదిరింపు ధోరణితో కూడిన ప్రవర్తన ఎదురైందని ఆరోపించాడు. సిబ్బంది మాట్లాడిన తీరు, నిబంధనలను అమలు చేసిన విధానం తనను తీవ్రంగా నిరాశపరిచాయని సోషల్ మీడియాలో వెల్లడించాడు. డబ్లిన్‌లో తనకు ఎదురైన తొలి చేదు అనుభవం ఇదేనని సంగా పేర్కొన్నాడు. డబ్లిన్‌లో.