Cancer Drug Price Cut 2026: భారత్లో క్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగులకు ఊరట కలిగించేలా 543 క్యాన్సర్ మందుల ధరలకు సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (NPPA) విడుదల చేసిన కొత్త ధరల జాబితా ప్రకారం, 397 మందుల ధరలు తగ్గాయి. వీటిలో కొన్ని మందుల ధరలు 90 శాతానికి పైగా తగ్గాయి. కొత్త ధరలు 2026 నవంబర్ 9 నుంచి అమల్లోకి వస్తాయని ఈ నివేదిక పేర్కొంది..