Satish Jarkiholi: కర్ణాటకలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, గందరగోళం జరగలేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ మంత్రి సతీష్ జార్కిహోలి స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఈ ప్రక్రియపై స్పందిస్తూ, తన వ్యాఖ్యలతో ఆయన ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ పూర్తిగా పారదర్శకంగా, నిబంధనల ప్రకారమే జరిగిందని కుండబద్ధలు కొట్టారు. ఈ సవరణ ప్రక్రియలో భాగంగా కర్ణాటకలో దాదాపు కోటి మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడంపై వెలువడిన వార్తలపై మంత్రి స్పందించారు. ఈ నిర్ణయం సరైనదేనని ఆయన సమర్థించారు.