Hyderabad: ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ రేస్ క్లబ్ పరిసరాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ పేకాట దందాను చాదర్‌ఘాట్ పోలీసులు బట్టబయలు చేశారు. రేస్ క్లబ్ సమీపంలోని GP హబ్ భవనంలో జోరుగా సాగుతున్న మూడు ముక్కల పేకాట శిబిరంపై ఆకస్మిక దాడి చేసి 12 మంది జూదరులను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 28 రాత్రి మలక్‌పేట పరిధిలోని హైదరాబాద్ రేస్ క్లబ్ పక్కనే ఉన్న GP హబ్ బిల్డింగ్‌లో డబ్బులు పందెంగా.