కమిటీ కుర్రోళ్లు, రాకాస సినిమాలతో నిర్మాతగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ప్రస్తుతం ఆమె తన సోదరుడు వరుణ్ తేజ్ తో కలిసి బరి అనే స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు మెగా డాటర్. నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. ఈ సినిమాకు రుద్ర అత్రి దర్శకత్వం వహించనున్నారు.