Mouli: యూట్యూబ్లో తనదైన కామెడీ టైమింగ్తో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న కంటెంట్ క్రియేటర్ మౌళి.. ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘దొంగనా కొడుకు’ సినిమా నుంచి విడుదలైన ‘ఓ మై గాడ్’ పాట లాంచ్ ఈవెంట్లో హీరో మౌళి మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చిన్నప్పుడు నలుగురి ముందు మాట్లాడటానికే భయపడి కన్నీళ్లు పెట్టుకున్న ఒక సాధారణ కుర్రాడు.. నేడు.