Minor Girl Abused: రక్షణగా నిలవాల్సిన కన్నతల్లే కాసులకు కక్కుర్తిపడి మౌనం వహించడంతో, ఎనిమిదేళ్ల ప్రాయం నుంచే ఓ అభాగ్య బాలిక కామాంధుల చేతిలో చిక్కి నరకం అనుభవించిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరుసగా లైంగిక దాడులకు పాల్పడిన ముగ్గురు నిందితులతో పాటు, వీరికి సహకరించిన బాలిక తల్లిని తాండూరు పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. కోసిగి మండలం ఎరుపుమల్ల గ్రామానికి చెందిన ఒక.