రాజధాని నగరంలోని ఐటీ కారిడార్‌లో నిత్యం నరకం చూపిస్తున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్క్ చుట్టూ అమలవుతూ విజయవంతమైన ‘వన్-వే లూప్’ విధానాన్ని ఇప్పుడు సైబరాబాద్ పరిధిలోనూ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయే సమస్యకు చెక్ పెట్టేందుకు ఈ సరికొత్త ప్రణాళికను రూపొందించారు. పీక్.