Off The Record: సింహపురి పాలిటిక్స్‌లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డికో పేజీ ఉంది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఏ పార్టీలో ఉన్నా… తన అనుచరులను కాపాడుకుంటూ వస్తారనేది అందరూ చెప్పే మాట. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో తన వ్యూహాలతో ఫ్యాన్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అసలు వైసీపీకి చివరి నిమిషం వరకు ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి దొరక్కుండా కూడా గేమ్ ఆడారన్నది లోకల్ టాక్..