కృష్ణా జలాల వినియోగం విషయంలో తప్పులను కప్పిపుచ్చుకుంటూ, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన అధికారిక అజెండాకు, మంత్రి చెబుతున్న లెక్కలకు పొంతన లేదని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ప్రశ్నించారు. కేఆర్ఎంబీకి ఒక లెక్క చెబుతూ, తెలంగాణ ప్రజలకు మరో లెక్క చెబుతూ ప్రభుత్వం మోసం.