బయట చూస్తే ఈదురు గాలులతో కూడిన కుంభవృష్టి వర్షం.. ఇంట్లో తలదాచుకుందామంటే కళ్లముందే ఒళ్లు గగుర్పొడిచే భయానక దృశ్యం.. గదిలోని సామాన్ల మధ్య ఏదో కదులుతోందని టార్చ్ వేసి చూసిన ఆ మహిళకు ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. వర్షానికి తలదాచుకునేందుకు ఇంట్లోకి దూరి నక్కి కూర్చున్న భారీ కొండచిలువను చూసి, ప్రాణభయంతో జోరు వర్షంలోనే రోడ్డుపైకి పరుగులు తీసిన ఘటన అనకాపల్లి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.