AP MPTC, ZPTC Elections Rescheduled: ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికల షెడ్యూల్ను రీషెడ్యూల్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇక, అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 6న రీపోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 7న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్.