AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్లో భారీ నష్టాన్ని మిగిలిచ్చింది.. అయితే, అర్నబ్ తుఫాన్ ప్రభావం, తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం రేపు అత్యవసరంగా సమావేశం కానుంది. తుఫాన్ పరిస్థితులు, ప్రభావిత జిల్లాల్లో జరిగిన నష్టం, ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులపై ఏపీ కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. బాధితులకు అందిస్తున్న సహాయక చర్యలు, పునరుద్ధరణ పనుల పురోగతిపై కూడా సమీక్షించే అవకాశం ఉంది. మరోవైపు, అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు.