సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల భార్యల గురించి, అలాగే పలువురు ప్రముఖులతో తనకున్న అనుబంధంపై ఉపాసన కొణిదెల ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇండస్ట్రీలో తనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని, స్టార్ హీరోల భార్యతో తనకున్న అనుబంధాన్ని ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఉపాసన ఓ ఇంటర్వ్యూలో సమంత, నమ్రత శిరోద్కర్, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి వంటి పలువురు ప్రముఖులతో తనకున్న అనుబంధంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.