తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వేదికపై చాటిచెప్పి, ఆస్కార్ అవార్డు సాధించి చరిత్ర సృష్టించిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి అఖండ విజయాల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకున్నాయి. రాజమౌళి తన కెరీర్ను ప్రారంభించిన స్టూడెంట్ నంబర్ 1 చిత్రంపై తాజాగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక టీవీ షోలో ప్రభాస్, రాజమౌళి పాల్గొన్నారు.