Abhishek Sharma: న్యూజిలాండ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ రికార్డు సెంచరీతో చెలరేగాడు. 199 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే ఊదేసింది. వైభవ్ సూర్యవంశీతో కలిసి పవర్‌ప్లేలోనే రికార్డు స్కోరు సాధించిన యంగ్ టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. Abhishek Sharma: న్యూజిలాండ్ గడ్డపై హెన్రీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. గాలి తీవ్రత బ్యాటర్లకు సవాల్ విసురుతుందన్న అంచనాలను తలకిందులు చేస్తూ సిక్సర్ల వర్షం కురిపించాడు.