Israel Election Exit Polls: ఇజ్రాయెల్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ కూటమికి పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మాజీ సైనికాధికారి గాడి ఐసెన్కాట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి కొన్ని అంచనాల్లో ఆధిక్యంలో నిలవడంతో తదుపరి ప్రభుత్వం ఎవరిది అనే ప్రశ్న కీలకంగా మారింది. అయితే, ఇప్పటివరకు ఏ కూటమికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ కనిపించడం లేదు..