Jio Platforms IPO Listing: భారత స్టాక్ మార్కెట్లో నేడు జియో ప్లాట్‌ఫామ్స్ (Jio Platforms) షేర్ల లిస్టింగ్‌పై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఈ డిజిటల్, టెలికాం సంస్థ ఐపీఓ దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూలలో ఒకటిగా నిలిచింది. నేడు, అక్టోబర్ 28న NSE, BSEల్లో షేర్ల ట్రేడింగ్ ప్రారంభం కానుంది. అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ద్వారా సుమారు రూ.30,213 కోట్లు సమీకరించింది..