Cyclone Arnab Effect at Uppada: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్రతీరం అతలాకుతలమైంది. తీరప్రాంత గ్రామాలపై రాకాసి అలలు విరుచుకుపడటంతో పలుచోట్ల ఇళ్లలోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది. అలల ఉద్ధృతికి సుమారు 30 ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరోవైపు బలమైన ఈదురుగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. సముద్రపు అలల ధాటికి రక్షణ గోడలు ధ్వంసం కాగా.. ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. దీంతో అధికారులు రాకపోకలను నిలిపివేసి సహాయక చర్యలను వేగవంతం చేశారు..