తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో మూడో ఎడిషన్ ఆలిండియా పోలీస్ పురుషులటీ20 క్రికెట్ టోర్నమెంట్ డిసెంబర్ 10 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, పోలీసు విభాగాలకు చెందిన సుమారు 35 జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు టోర్నీ నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం వివిధ విభాగాల అధికారులతో డీజీపీ సమీక్షించారు.