ప్రముఖ ఏఐ సేవల సంస్థ ఇన్నోడేటాలో ఉద్యోగుల తొలగింపులు కలకలం రేపాయి. భారత్‌లో దాదాపు 550 మంది ఉద్యోగాలు కోల్పోగా ఫిలిప్పీన్స్‌లోనూ ఉద్యోగులపై వేటు పడింది. ఉదయం మామూలుగానే విధులకు హాజరైన ఉద్యోగులకు లంచ్ తర్వాత కంపెనీ సిస్టమ్‌ల నుంచి లాగ్అవుట్ కావడం, అధికారిక ఐడీలు పనిచేయకపోవడంతో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం తర్వాత కలకలం ఢిల్లీలో పనిచేస్తున్న 28 ఏళ్ల ఇంజినీర్‌కు అక్టోబర్ 26 సోమవారం సాధారణ పనిదినం లాగానే ప్రారంభమైంది. మిగతా ఉద్యోగుల మాదిరిగానే కంపెనీ సిస్టమ్‌లోకి లాగిన్ అయ్యాడు. హాజరు నమోదు చేసుకుని రోజువారీ పనులు మొదలుపెట్టాడు.