పైడిమాంబ సిరిమానోత్సవం కన్నుల పండువగా సాగింది. అర్నబ్ తుఫాన్‌ను కూడా భక్తులు లెక్కచేయకుండా తరలివచ్చారు. భక్తుల కొంగుబంగారంగా కొలిచే అమ్మవారి ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైన సిరిమానోత్సవం వర్షంలోనూ వేడుకగా జరిగింది. 60 అడుగుల పొడవైన సిరిమాను నుంచి ప్రధాన పూజారి అభయం ఇచ్చారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పైడిమాంబ సిరిమానోత్సవం వైభవంగా సాగింది. అమ్మవారి ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైన సిరిమానోత్సవంలో పాల్గొనేందుకు వర్షాన్ని సైతం భక్తులు లెక్కచేయలేదు. భక్తుల కొంగుబంగారంగా కొలిచే పైడితల్లి అమ్మవారి ఉత్సవాన్ని విజయవంతంగా ఉత్సాహంగా కొనసాగించారు. సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు కూడా వర్షాన్ని లెక్కచేయకుండా తరలివచ్చారు.