బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న ‘అర్నబ్’ (Arnab) తీవ్ర తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఇప్పటికే పలు రైళ్లు రద్దవగా, తాజాగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. తుఫాన్ ఉధృతి కారణంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన ఇండిగో (IndiGo) విమానాలన్నింటినీ బుధవారం (అక్టోబర్ 28) ఒక్కరోజూ పూర్తిగా రద్దు చేసినట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. విజయవాడలో ఇండిగో విమానాలు బంద్.. ఇతర సర్వీసులు కూడా రద్దు.