Story Board: పైసా మే పరమాత్మా హై అంటారు. ఎంత ఆన్లైన్ లావాదేవీలు చేసినా.. చేతిలో డబ్బు ఉంటే ఆ ధైర్యమే వేరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏటీఎంకి వెళ్లి క్యాష్ డ్రా చేసుకునే జనానికి.. ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్నాళ్లుగా ఏటీఎంలలో నగదు నిండుకుంది. బ్యాంకుకు వెళ్లినా అడిగినంత మొత్తంలో లిక్విడ్ ఇవ్వడం కుదరదంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద మొత్తంలో నగదు విత్డ్రాయల్స్పై అప్రకటిత నిషేధం అమలౌతోంది. బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా.