అర్నబ్ తుపాను నేపథ్యంలో పలు ప్రధాన రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. హైదరాబాద్: అర్నబ్ తుపాను (Cyclone Arnab) నేపథ్యంలో పలు ప్రధాన రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (Indian Railways) రద్దు చేసింది. ఇవాళ (అక్టోబర్ 27) హైదరాబాద్, సికింద్రాబాద్, లింగంపల్లి నుంచి బయల్దేరే గోదావరి, ఫలక్‌నుమా, గరీబ్‌రథ్, విశాఖ, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఓ ప్రకటనలో తెలిపారు. నాగర్సోల్-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌ను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. 28న శ్రీకాకుళం రోడ్డు నుంచి చర్లపల్లికి వచ్చే రైలును కూడా రద్దు చేసినట్లు సీపీఆర్వో తెలిపారు.