ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామరవాయి, భూపతిపూర్ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో గుహ ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఆది మానవులు నివసించినట్లు ఆనవాళ్లుతాడ్వాయి(ములుగు): ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామరవాయి, భూపతిపూర్ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో గుహ ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. జింకల పడ అనే అటవీ ప్రాంతంలో గుడ్డేలుగు గుహ ఉందని, అటు వైపు వెళ్తే ప్రమాదమని ప్రచారం జరుగుతోంది. దామరవాయి గ్రామానికి చెందిన యువకుడు కార్తీక్ తన స్నేహితులు మహేష్, నాగరాజులతో కలి సి ఈనెల 20న గుహను సందర్శించాడు. గ్రామం నుంచి గుహ జాడలు గుర్తిస్తూ గంటలపాటు అడవిలో వీరు ప్రయాణించారు.