జుట్టు ఒత్తుగా, బలంగా, మెరుస్తూ ఉండాలని చాలామంది కోరుకుంటారు. అందుకోసం కొబ్బరి నూనె, బాదం నూనె లేదా ఇతర హెయిర్ ఆయిల్స్‌ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంటారు. అయితే నూనె రాయడంలో కూడా ఎన్నో సందేహాలు ఉంటాయి. ఉదయం తలస్నానానికి ముందు నూనె రాయడం మంచిదా? రాత్రి పడుకునే ముందు తలకు నూనె పట్టించి ఉదయం వరకు అలాగే ఉంచాలా? రాత్రంతా నూనె ఉంచితే జుట్టు వేగంగా పెరుగుతుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే జుట్టు సంరక్షణలో నూనె రాసే సమయం కంటే దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామనేది కూడా కీలకమే.