అర్నబ్ తుఫాన్ ముంచుకొస్తుందని, ఏపీలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తుఫాన్ గురించి తాను, పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని, దీనిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని తెలిపారు. విజయవాడలో కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షడు మాధవ్ ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలపై కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. స్థానికంగా విభేదాలపై బాబు, పవన్, మాధవ్ స్పష్టత ఇచ్చారు.