ట్రైన్లో అత్యవసర పరిస్థితుల సమయంలో చైన్ లాగడం వల్ల రైలు ఆగిపోతుంది. అయితే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే చైన్ లాగాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా చైన్ లాగితే జైలుశిక్ష విధిస్తారు. అంతేాకాదు జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. ఏయే పరిస్థితుల్లో చైన్ లాగవచ్చనేది తెలుసుకుందాం. జీవితంలో ఇప్పటివరకు ప్రతీఒక్కరూ ఒక్కసారైనా రైలు ప్రయాణం చేసి ఉంటారు. ప్రపంచంలోన అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా రైళ్ల ద్వారా సులువుగా చేరుకునే సౌలభ్యం ఉంది. దేశంలో రైల్వే వ్యవస్థ రోజురోజుకు అప్గ్రేడ్ అవుతూ ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని అందిస్తోంది.