తెలుగు సినీ పరిశ్రమలో తన విలక్షణ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నవరస నటనా సార్వభౌమ రాజేంద్ర ప్రసాద్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, యువతారలతో అనుబంధం, తనను తీర్చిదిద్దిన కీలకమైన పాఠాల గురించి ఆయన పలు విషయాలు వెల్లడించారు. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న అపూర్వమైన కష్టాలను, వ్యక్తిగత పోరాటాలను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో పంచుకున్నారు. ఆయన మాటల్లో, ఆ రోజుల్లో తాను పడిన కష్టాలు అంతా ఇంతా కాదని, అవి తనను ఆత్మహత్య ఆలోచనల వరకు తీసుకెళ్లాయని తెలిపారు.