హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పలుమార్లు నకిలీ బాంబు బెదిరింపు ఈమెయిల్స్ పంపిన కేసులో చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శరత్ సుబ్రహ్మణ్యాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా 700–800 వరకు బెదిరింపు సందేశాలు పంపినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్ / చెన్నై: హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)తో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 800 సార్లు విమానాశ్రయాలకు వరుసగా నకిలీ బాంబ్ బెదిరింపు ఈమెయిల్స్ పంపిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.