Hyderabad: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా భారీ పేలుడును తలపించే శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉదయం 9:15 గంటల సమయంలో ఎర్రబోడ, ఉప్పరపల్లి, లంగర్‌హౌస్, కేశవస్వామినగర్, అత్తాపూర్ వంటి పలు ప్రాంతాల్లో ఈ భారీ శబ్దాలు వినిపించాయి. శబ్దం వచ్చిన సమయంలో దాదాపు 10 సెకన్ల పాటు భూమి కంపించినట్లు అనిపించడంతో, అసలేం జరిగిందో తెలియక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు, భవనాల పైకి పరుగులు తీశారు. ఎక్కడైనా.