Ragi Samosa Recipe: సమోసాలు అంటే అందరికీ ఎంతో ఇష్టం. సాయంత్రం పూట వేడివేడి టీతో సమోసా తింటూ కబుర్లు చెప్పుకోవడం చాలామందికి అలవాటు. అయితే, రోజూ ఒకేలాంటి మైదా లేదంటే గోధుమ పిండితో చేసిన బంగాళాదుంప సమోసాలు తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త కొత్తగా, ఆరోగ్యకరంగా రాగి పిండితో సమోసాలు ట్రై చేయండి. రాగి పిండితో చేసే ఈ సమోసాలు రుచిలో అద్భుతంగా ఉండటమే కాకుండా, బంగాళాదుంప, బఠాణీ, జీడిపప్పు, కిస్మిస్లతో చేసే స్టఫింగ్ వీటి ప్రత్యేకతను మరింత పెంచుతుంది. రాగిలో క్యాల్షియం, పీచు పదార్థం (ఫైబర్) వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.