Hyderabad: హైదరాబాద్ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేబుల్ బ్రిడ్జి పైనుంచి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన రాజేష్ (25) నగరంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. నగరంలోని నాచారం ప్రాంతంలో ఉన్న ఓ హాస్టల్లో ఉంటూ విధులకు హాజరవుతున్నాడు. కాగా, నిన్న మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉంటున్న తన స్నేహితులను కలిసేందుకు రాజేష్ అక్కడికి వెళ్లాడు.