Kitchen Cleaning Tips: వంట చేసేటప్పుడు కొన్నిసార్లు పాలు పొంగిపోవడం, లేదా పప్పు, కూరలు గిన్నె అడుగున మాడిపోయి గట్టిగా అతుక్కపోవడం జరుగుతుంటుంది. నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగినా, ఆ తర్వాత వచ్చే టెన్షన్ అంతా ఇంతా కాదు. మాడిపోయిన గిన్నెలను శుభ్రం చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. నల్లటి, గోధుమ రంగు మరకలు ఎంత మొండివంటే, సబ్బు రాసి స్క్రబ్బర్‌తో గట్టిగా రుద్దినా సులభంగా వదలవు. కొన్నిసార్లు ఎక్కువ బలప్రయోగం చేయడం వల్ల పాత్రల మెరుపు కూడా తగ్గిపోతుంది. అయితే ఇకపై మాడిపోయిన గిన్నెలను క్లీన్ చేయడానికి చేతులు నొచ్చుకునేలా గంటల తరబడి శ్రమించాల్సిన అవసరం లేదు.