సాయి పల్లవి సీతగా నటించిన 'రామాయణం' సినిమా నవంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే నవంబర్ నెలలోనే మరో క్రేజీ సినిమాతో ఆడియెన్స్ ను పలకరించనుందీ న్యాచురల్ బ్యూటీ. ఇందులో ఆమె నిత్యారెడ్డి ఐపీఎస్ గా పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓం – చాప్టర్ 1: ఉధిరం – ది బ్లడ్ వుడ్’ నుంచి హీరోయిన్ సాయిపల్లవి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో విడుదలైంది. ఈ సినిమాలో ఆమె నిత్యారెడ్డి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.