అక్కడ అన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. తమ్ముడు మున్సిపల్ చైర్మన్ పీఠం టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ పదవిని బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది. తాను మాత్రం వెనక్కు తగ్గేదే లేదంటూ ఏకంగా మూడు నామినేషన్లు వేశారు ఎమ్మెల్యే సోదరుడు. మార్కాపురం జిల్లా గిద్దలూరులో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూటమి పార్టీల మధ్య అంతర్గత రాజకీయాన్ని తెరపైకి తెచ్చింది. ఇంతకీ మూడు నామినేషన్ల వెనుక వ్యూహమేంటి?తెరవెనుక ఏం జరిగింది?ఈ ఎన్నికల్లో ఏం జరగబోతోంది? గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ పీఠం..కూటమి.