ఆ నియోజకవర్గంలో కొంతమంది కాంగ్రెస్ నేతల రహస్య సమావేశానికి కారణం ఏంటి?అధికార పార్టీ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయారా?అసంతృప్తులు అందరూ ఒక్కటవుతున్నారా? ఆ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? వికారాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో కొందరు నేతలు రహస్యంగా సమావేశాలు నిర్వహించడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అసంతృప్త నేతలు పలుమార్లు సమావేశాలు నిర్వహించారని ప్రచారం నడుస్తోంది. బషీరాబాద్ మండల కాంగ్రెస్‌లోనూ అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయట. దీంతో తాండూరు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుందనే.