Chairmans Desk: తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా రాజకీయం కొత్త పోకడలు పోతూనే ఉంది. కానీ ఎన్నిసార్లు ట్రెండ్ మారినా.. మునుపెన్నడూ లేని విధంగా ఇటీవలి కాలంలో దిగజారుడుతనం బాగా పెరిగిపోయిన వాస్తవం కళ్లకు కడుతోంది. రాజకీయాల్లో నైతిక విలువలకు ఎప్పుడో కాలం చెల్లింది. మొన్నటిదాకా వ్యూహప్రతివ్యూహాలైనా ఉండేవి. ఇప్పుుడవీ లేకుండా పోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా రాజకీయం అంటే వ్యక్తిత్వం హననం మాత్రమే. అంతకు మించి ఆలోచించటానికి కూడా పార్టీలు, నేతలు ఇష్టపడటం.