అన్నదాతను అర్నబ్ తుపాను వణికిస్తోంది. ఎల్నినో ప్రభావంతో సాగునీరు సక్రమంగా అందక ఆది నుంచి వరి సాగును అవస్థలతో చేశారు. మండలంలో 25 వేల ఎకరాల సాగుభూమి ఉండగా, 22 వేల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. సాగునీరు సక్రమంగా అందక ఆయిల్ ఇంజన్ల సహాయంతో కాలువల్లో ఉన్న కొద్దిపాటి నీటిని పెట్టుకుంటూ పంటను కాపాడుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో అర్నబ్ తీవ్ర తుపాను రాబోతుందని అధికారులు హెచ్చరించడంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. సాగునీటికి అధిక వ్యయం అయిందని, ప్రస్తుతం తుపాను వస్తే పంట పరిస్థితి ఏమవుతుందోనని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. గమనిక: ఈనాడు.