ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉంటూ, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు, విద్యాలయాలకు ఈ నెల 27, 28 తేదీల్లో సెలవు ప్రకటిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. అయితే ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలకు ఎటువంటి సెలవులు ఉండవని, ఎటువంటి హాస్టళ్లు లేని పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు మాత్రమే రెండు రోజుల సెలవు వర్తిస్తుందన్నారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లోని విద్యార్థులు ఈ రెండు రోజులు వసతి గృహాల్లోనే ఉండాలన్నారు. ఆయా విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు.