రంజీ ట్రోఫీ మూడో రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు తొలి రోజు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. గ్రూప్-బిలో భాగంగా జింఖానా మైదానంలో పంజాబ్తొ సోమవారం మొదలైన మ్యాచ్‌లో మొదటి రెండు సెషన్లలో ఐదు వికెట్లు పడగొట్టినా.. అదే జోరును కొనసాగించలేకపోయారు. హైదరాబాద్, ఆట ప్రతినిధి : రంజీ ట్రోఫీ మూడో రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు తొలి రోజు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దాంతో పంజాబ్ 90 ఓవర్లలో 289/6తో తొలి రోజు ఆట ముగించింది. ఐపీఎల్ స్టార్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (81), సలీల్ అరోరా (57 బ్యాటింగ్), రమణ్‌దీప్ (52) అర్ధ శతకాలతో సత్తా చాటారు.