టాలీవుడ్ లవ్లీ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా జంటగా నటించిన లేటెస్ట్ సినిమా. విజయ్ దేవరకొండ, రష్మిక పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు విరోష్ టీమ్. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో విజయ్, రష్మిక పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ డి.సి.పి.కి కంప్లైంట్ ఇచ్చారు. ఈ దుష్ప్రచారం విరోష్ జంటకు ఇబ్బందులు కలగజేసిందని వారి టీమ్ ప్రతినిధి ఫిర్యాదులో పేర్కొన్నారు.