యూపీఎస్సీ మాక్ ఇంటర్వ్యూలో ఓ అభ్యర్థికి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. 'భవిష్యత్తులో మీకు అబ్బాయి పుడితే, అతనికి నీలం రంగు దుప్పటి ఇస్తారా? లేక గులాబీ రంగుదా?' అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించారు. దీనికి అభ్యర్థి ఇచ్చిన సమాధానం ప్యానెల్ సభ్యులు నవ్వులు పూయించింది. ఆ తర్వాత జరిగిన సరదా సంభాషణ ఈ మాక్ ఇంటర్వ్యూను మరింత ఆసక్తికరంగా మార్చింది.. యూపీఎస్సీ (UPSC) ఇంటర్వ్యూలలో అభ్యర్థుల జ్ఞానాన్ని మాత్రమే కాకుండా, వారి ఆలోచనా విధానం, సమయస్ఫూర్తి, వ్యక్తిత్వం, క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలా స్పందిస్తారనే అంశాలను కూడా పరిశీలిస్తారు. అందుకే కొన్నిసార్లు ఇంటర్వ్యూయర్లు ఊహించని ప్రశ్నలు అడుగుతుంటారు.