వెనిజులా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఏడాది కాలం ప్రవాసంలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి విజేత, ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోఆదివారం తిరిగి తన దేశానికి చేరుకున్నారు. ఆమె రాకతో వెనిజులా రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరిగి దేశంలో అడుగుపెట్టిన విషయాన్ని మచాడో సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మీతోనే ఉన్నాను’ అంటూ స్పానిష్ భాషలో ఎక్స్ (X)లో పోస్టు చేశారు. మచాడో తిరిగి వెనిజులాకు చేరుకున్న విషయాన్ని ఆమె సన్నిహితుడు, మరో ప్రతిపక్ష నేత ఎడ్ముండో గొంజాలెజ్ ఉర్రుటియా ధ్రువీకరించారు.