కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో మోసపోయానని మనస్తాపానికి గురైన ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన అఖిల మృతితో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన అక్షయ్ అనే యువకుడితో అదే గ్రామానికి చెందిన అఖిలకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమ వ్యవహారానికి దారితీసినట్లు సమాచారం.