ముఖం కాంతివంతంగా కనిపించాలని, చర్మం మృదువుగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఇందుకోసం ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులనే ఉపయోగించాల్సిన అవసరం లేదని భావిస్తూ ఇంట్లో లభించే పదార్థాలతో ఫేస్ ప్యాక్‌లు తయారు చేసుకునేవారూ ఉన్నారు. అలాంటి వాటిలో ఎర్ర కందిపప్పు లేదా మసూర్ దాల్‌తో చేసే ఫేస్ ప్యాక్‌లు కూడా ఒకటి. ఈ పప్పును నానబెట్టి మెత్తగా రుబ్బి, పెరుగు, తేనె, పసుపు లేదా రోజ్ వాటర్ వంటి పదార్థాలతో కలిపి వివిధ రకాల ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు.